ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు

ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు

  • జిల్లా కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) గోదాం వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం గోదాం వద్ద 24 గంటలపాటు భద్రతా ఏర్పాట్లు ఉన్నాయని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు జమీల్, నాయబ్ తహసిల్దార్ శ్యామ్‌లాల్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.