crime | వనస్థలిపురంలో ఘటన
crime | వనస్థలిపురంలో ఘటన
crime | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని వనస్థలిపురం డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపులు భరించలేక భార్య అతన్ని హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
భర్తను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్న సమయంలో స్థానికులు గమనించి అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, భర్త వేధింపుల కారణంగానే ఈ ఘాతుకం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
