కానిస్టేబుల్‌పై దాడి చేసిన డ్రైవర్‌కు రిమాండ్..
గుడిహత్నూర్, ఆంధ్రప్రభ : జాతీయ రహదారి-44పై ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, మద్యం మత్తులో వాహనం నడిపిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంటైనర్ డ్రైవర్ విజయ్ కుమార్‌ను గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. గుడియత్నూర్
ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 4న ఆర్టీసీ బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుభాష్ రెడ్డి ప్రమాదకరంగా నిలిపిన కంటైనర్‌ను ఫోటో తీస్తుండగా, డ్రైవర్ గొడవకు దిగి యూనిఫాం కాలర్ పట్టుకుని విధులకు ఆటంకం కలిగించాడు. అనంతరం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో 63 మి.గ్రా./100 మి.లీ. ఆల్కహాల్ శాతం నమోదైంది. దీంతో కేసు నమోదు చేసి బోథ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
