Court | విజయ్, సంగీత విడాకుల కేసు వాయిదా

Court | విజయ్, సంగీత విడాకుల కేసు వాయిదా
Court | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీవీకే అధినేత విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఈ కేసు విచారణ చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు చేపట్టింది. జూన్ 15కు విడాకుల కేసును కోర్టు వాయిదా వేసింది. ఆరోజు విజయ్, సంగీత ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజీగా ఉన్న కారణంగా కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలుపగా.. కోర్టు అంగీకరించనట్లు తెలుస్తోంది.
విజయ్-సంగీత జంట పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శనివారం చెన్నైలో ఇరువురి లాయర్లు కలిసి చర్చలు జరిపారు. విడిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని..సెటిల్మెంట్ కింద సుమారు రూ.250 కోట్లు ఇవ్వాలని సంగీత కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కుమారుడు, కుమార్తెలకు కూడా సెటిల్‌మెంట్ ఇవ్వాలని సంగీత కోరుతుందట. అయితే విజయ్ మాత్రం రూ.35 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కుమారుడు, కుమార్తెల బాగోగులు తాను చూసుకుంటానని అంటున్నాడట.
