Deported – రెండో విమానం వచ్చేసింది – మూడో ఫ్లైట్ బయలు దేరింది.

అమృత్‌సర్‌ పంజాబ్ – ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఆ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వారి స్వదేశాలకు పంపించడం.

గతంలోనూ ఈ ప్రక్రియ ఉన్నా ట్రంప్‌ అత్యంత కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న భారతీయులను ఇప్పటికే స్వదేశానికి పంపించారు. కాగా తాజాగా మరో విమానం భారత్‌లో ల్యాండ్‌ అయ్యింది..

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని భారత్‌కు పంపించే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెల 5వ తేదీన 104 మందితో వచ్చిన అమెరికా యుద్ధ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ విమానశ్రయంలో ల్యాండ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 116 మంది భారతీయులతో మరో విమానంలో ఇదే విమానాశ్రయంలో దిగింది. ఈ విమానం శనివారం అర్థరాత్రి 11.35 గంటలకు ల్యాండ్‌ అయ్యింది.నిజానికి ఇంకాస్తా ముందుగానే రావాల్సిన ఈ విమానం 90 నిమిషాలు ఆలస్యమైంది. ఇమిగ్రేషన్, వెరిఫికేషన్ వంటి ప్రాసెస్ పూర్తయిన తర్వాత వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించారు. వీరిలో 60 మందికిపైగా పంజాబ్‌కు చెందినవారు ఉండగా 30 మంది హర్యానాతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. అలాగే జమ్మూ కశ్మీర్‌కు చెందిన వారు కూడా ఉన్నారు.

మరో విమానం..ఇదిలా ఉంటే మరో విమానం భారత్‌లో ల్యాండ్ కానుంది. 157 మందితో కూడిన విమానం నేటి అర్ధరాత్రి అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కానుంది. వీరిలో 59 మంది హర్యానాకు, 52 మంది పంజాబ్‌కు, 31 మంది గుజరాత్‌కు చెందినవారు ఉన్నారు. అయితే ఈ ప్రాసెస్‌ ఇంకా కొనసాగనుందని తెలుస్తోంది.

ఇప్పటికే అమెరికా ప్రభుత్వం సుమారు 500 మంది అక్రమంగా ఆ దేశంలో ఉంటున్నట్లు గుర్తించినట్లు. త్వరలోనే వారిని భారత్‌కు తిరిగి పంపించనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.ఎవరిని పంపిస్తున్నారు.?అమెరికాలో సరైన పత్రాలు లేకుండా, గడువు ముగిసిన వీసాలతో నివసిస్తున్న వారిని తమ తమ దేశాలకు పంపిస్తున్నారు.

అలాగే విద్యార్థి వీసాలపై వెళ్లి అక్కడే ఉండిపోతున్న వారిని. అక్రమ మార్గాల్లో అమెరికాలోకి వెళ్లిన వారిని తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల నిఘా కఠినతరం చేశారు. వారి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారి జాబితాను సిద్ధం చేసి వారి వారి దేశాలకు పంపిచేస్తున్నారు.

అమృత్‌సర్‌లోనే ఎందుకు.?

ఇదిలా ఉంటే అమెరికా నుంచి వస్తున్న విమానాలు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనే ల్యాండ్‌ అవుతుండడంపై రాజకీయ వివాదం నెలకొంది. ఈ విమానాలను కావాలనే కేంద్ర ప్రభుత్వం అమృత్‌సర్‌లో ల్యాండ్ చేస్తోంది. పంజాబ్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌సింగ్ విమర్శించారు.అయితే ఈ విమర్శల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని చెబుతోంది. అమెరికా నుంచి ఇండియాకు ఎయిర్‌ రూట్‌ను గమనిస్తే భారత్‌లో నియరెస్ట్‌ ఎయిర్‌ పోర్ట్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉందని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *