TG | ఆర్ఆర్ఆర్ పై కీల‌క అప్డేట్…

కేంద్రం సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారనే అంశంపై క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం కేంద్రం సహకారంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనే అంశంపై శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ…

ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి కేంద్ర మంత్రి గడ్కరీతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపానని ఆయన అన్నారు. రాబోయే రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాబోయే మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *