Bodhan | ఉపాధి హామీ పనిలో కూలీ ఆకస్మిక మృతి

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఎరాజ్‌పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న ఓ కూలీ అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనిచేస్తున్న పోశెట్టి ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ అక్కడికి చేరుకున్నప్పటికీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, ఉపాధి హామీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.