యువతకు మెరుగైన ఉపాధి కల్పన అవసరం!

యువతకు మెరుగైన ఉపాధి కల్పన అవసరం!

  • నీట్ పేపర్ లీక్‌తో వెలుగులోకి వచ్చిన నిరుద్యోగ సమస్య
  • విద్య–ఉపాధి మధ్య పెరుగుతున్న అంతరం
  • గ్రాడ్యుయేట్లలో పెరుగుతున్న నిరుద్యోగం ఆందోళనకరం
  • విద్యా విధానం, ఉద్యోగ విధానంలో సంస్కరణల అవసరం
  • ప్రభుత్వాల దృష్టి ఉపాధి సృష్టిపై పడాల్సిన సమయం
  • నిరాశలో యువత.. అవకాశాల కల్పనతోనే పరిష్కారం

‘నీట్’ పేపర్ లీక్ విద్యార్థుల ఆందోళనతో ముఖ్య మైన అంశాన్నే తెరమీదికి తెచ్చింది! కాక్రోచ్ జనతా పార్టీ అంశం యొక్క ప్రాముఖ్యతను వెలుగులోకి తెచ్చిన మాట నిజం! నిరుద్యోగ సమస్య ఆ అంశంగా భావిస్తే అది దేశం లో ఎంత లోతుగా సమస్యలకు మూలకారణమైందో ప్రభుత్వాలు చూడగలుగుతే పరిష్కార మార్గాల మీద దృష్టిపెట్టే అవకాశం వుంది! విహంగ వీక్షణంతో సమస్య అసలు స్వరూపం అర్ధం కాకపోవచ్చు! ఇప్పటి వరకూ వచ్చిన దాదాపు అన్ని ప్రభుత్వాలూ విద్యను సంక్షేమ కార్య క్రమంగానే భావించి విద్యార్థులకు విద్యాలయాలల్లో వసతులను గురించి, మధ్యాహ్న భోజనాల గురించి తది తర సంబంధిత అంశాలను గురించే దృష్టి పెట్టాయి కానీ, చదువుకున్న విద్యార్థులు యువతగా మారి, ఉద్యోగాల కోసం విద్యాలయాల నుండి బయటి ప్రపంచంలో అడుగు పెట్టి నప్పుడు వారికి ఎలాంటి ఉద్యోగాలు కల్పించే వాతావ రణంతో బాటు ఎన్ని ఉద్యోగాలు, ప్రభుత్వ సంస్థల్లో కానీ, కార్పొరేట్ వ్యవస్థల్లో కానీ, గ్రామీణ ప్రాంతాలలో కానీ అందుబాటులో వున్నాయి అన్న మూల సూత్రం మీద, అసలైన అవసరం మీద, కావల్సిన రీతిలో దృష్టి పెట్టకపో వటం వల్ల, యువత విద్యార్థులు ఉద్యమాల పేరుతో వీధు లకు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది! ‘కీలెరిగి వాతపెట్టటం’ ముతక సామెతే కానీ అసలు సమస్యను కనుగొని, పరిష్కార మార్గాలు కనుగొన లేకపోవటం యిన్నాళ్ళ నుంచి పాలకు లుగా వున్నవారు చేయలేకపోయారు. నిజానికి దానికి తగ్గ ప్రభుత్వ విధానాలను కనుగొనే వ్యవస్థలను నిర్దుష్టమైన రీతిలో సృష్టించలేక పోయారు. విద్యాధికులను కమిటీల రూపంలో కానీ, మరోరూపంలో కాని ఏర్పాటు చేసి బ్లూ ప్రింట్లను తయారు చేసుకొని సమస్య లోతుపాతులను అంచనా వేసుకోవటంతో పాటు ఆల్ ఇండియా సర్వీసు లలో చేరే సంఖ్యను ప్రక్కనపెట్టి క్రింద నుంచి పైవరకూ సంవత్సరానికి ఎన్ని రంగాలలో ప్రభుత్వంతో సహా, ఉద్యో గాలు చదువును బట్టి వుండగలవో లెక్కలు, నిర్దుష్టంగా కాక పోయినా అంచనా తరహాలో బహిర్గతం చేసినట్లయితే ఉద్యోగాలు ఎవరు పొందుతారు ఎవరు పొందలేరు అర్హత లూ క్వాలిఫికేషన్లు యిలాంటి విషయాలు అన్నీ ఉద్యోగాల వేటలో వుండేవారికి తేలిగ్గా అందుబాటులో వుండేవి! ఆ ఎక్సర్సైజు ఏ శాఖలోనూ జరగకపోవటం వల్ల బయటికి

యువతకు మెరుగైన ఉపాధి కల్పన అవసరం!

న్ని ఉద్యోగాలున్నాయి అని అంచనాల రూపంలో కాకిలెక్కలు మాత్రమే వచ్చాయి! ఒక ఉద్యోగానికి అందు కనే పదివేల మంది పోటీలో వుంటున్నారు! సంతృప్తి పొందేవారి శాతం బహు తక్కువగా వుంటే అసంతృప్తితో రగిలిపోయే నిరుద్యోగుల సంఖ్య వేల రెట్లలో ప్రతి సంవ త్సరం పెరిగిపోయి నిరుద్యోగ భూతం, కరాళ నృత్యానికి కారణంగా మారింది. మిడతల దండు అదుపు లేనిరీతిలో, అందుకే అన్ని ప్రాంతాలలో ఉద్యమాలతో పాటు శాంతి భద్రతల సమస్యలకు కారణమైంది! ‘జస్ట్ జాబ్స్ నెట్వర్క్’ రిసెర్చి డైరెక్టర్గా వున్న డాక్టర్ షిప్రా నిగాం, సేకరించిన వివరాలు పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తాయి!

15-20 ఏ వయసు గ్రూప్లో వున్న గ్రాడ్యుఏట్సు అత్యంత హెచ్చుస్థాయిలో నిరుద్యోగులుగా వున్నారు. స్కూలు విద్యను పూర్తి చేయని వారికంటే వ డు రెట్లు ఎక్కువగా వున్నట్లు లెక్క! గ్రాడ్యుఎట్స్ ఆపైన 22.7 శాతం వుంటే, సెకండరీ హైయ్యర్ సెకండరీ 8.1శాతం, మిడిల్ 4.6శాతం, ప్రైమరీ వరకు 2.8శాతం, చదువుకోని వారు 2.3శాతం వున్నట్లు ఆయన రిసెర్చి తెలుపుతున్నది!

విద్య పొందిన గ్రాడ్యుఏట్సు అంతకంటే ఎక్కువ చదివినవారి సంపాదన 23,046 రూ॥, హైయ్యర్ సెంకడరీ 14,520 రూ॥, సెకండరీ 13,360 రూ॥, మిడిల్ 12,326 రూ||, ప్రైమరీ చదివిన వారి సంపాదన 11,921 రూ॥ అయితే చదువుకోని వారి సంపాదన 11,305 రూ॥ (నెలకు) వుండటం ఆసక్తికరమైన విషయంగానే చెప్పుకోవచ్చు! చదువుకోని ఉద్యోగస్థుల సంపాదనకు హైయ్యర్ సెకండరీ వరకు చదివిన ఉద్యోగస్థులకు నెలసరి ఆదాయంలో పెద్దగా తేడా లేకపోవటం సర్వేను నమ్ముతే ఆశ్చర్యకరంగా కనిపించవచ్చు!

కర్షకులూ-కార్మికుల్లో 8 మందిలో ఒకరికే కాస్త సంతృప్తినిచ్చే ఉద్యోగం వుంది! ఇండ్లలో పని మనుషులు, కాజువల్ లేబర్ బహు హీనస్థితిలో పొట్టగడుపుకొనే ఉద్యో గాలు చేస్తున్నారు!

ఆల్ ఇండియా సర్వీసులో ఉద్యోగాలు, బ్యాంకు ఉద్యో గాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు, కార్పొరేట్ వ్యవస్థల్లో ఉద్యోగాలు గౌరవప్రదంగానూ, సంపాదన పరంగానూ వుండటంతో నిరుద్యోగ విద్యాధికులకు ఆకర్షణీయంగా వుంటాయి! అలాంటివి ఎన్ని ఉద్యోగాలున్నాయి అని లెక్కే ఉద్యోగాలు ఆశించేవారు పొందేవారి సంఖ్యలకు నక్కకూ నాగలోకానికి వున్న తేడా అన్నట్లుగా వుంటాయి!

నిరుద్యోగులు ముఖ్యంగా విద్యాధికులు వీధుల్లోకి మిడతల దండు వల్లనో మరో వ్యవస్థ వల్లనో వీధుల్లోకి ఎక్క టానికి కారణం విద్యార్హతలతో కూడిన చదువులకూ అందు బాటులో వున్న ఉద్యోగాలకు లంకె అందక పోవటం వల్లనే అని విశ్లేషకులు భావిస్తున్నారు!

ఆర్థిక పెట్టుబడులు స్వతంత్రం వచ్చిన తర్వాత గణనీయంగానే పెరిగాయి! కానీ పెట్టుబడులన్నీ వ్యవస్థలను నిర్మించటానికి ఖర్చు అవుతున్నాయి కానీ విద్యా వైద్య శాఖల్లో ఉద్యోగాలు ఏర్పడటానికి ద్విగుణీకృతం చేయటా నికి అక్కరకు చాలా తక్కువగా వస్తున్నాయి!

భారతదేశంలో కేవలం 2.7 శాతం (జి.డి.పి వాటాగా) విద్య మీద, 1.9శాతం వైద్యం మీద ఖర్చు చేస్తున్నారు! జాతీ య స్థాయి టార్గెట్లకు చాలా తక్కువ స్థాయిలో పెట్టుబడులు వున్నాయి.

దేశంలో రాజకీయాల స్వరూపం అధికారం ఏవి ధంగా సంపాదించాలనే దృష్టితోనే రూపు దిద్దుకుంటు న్నది. ప్రజల అవసరాలు, సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వం లోనివారు, విపక్షంలో వున్నవారు పట్టించుకోవటం లేదని చెప్పటం సత్యదూరమే అవుతుంది! ఎన్నికల ముందు విధా నాలు పార్టీ ఎజెండాలలో నమ్మశక్యం గాని రీతిలో విధా యకంగా దర్శనమిస్తాయి! మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు అరకొరగా, ఆకర్షణీయంగా ప్రజల బాగోగుల కోసం కాకుం డా, ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అమలు చేయటం నామ మాత్రంగా జరుగుతున్నదని ఎక్కువ శాతం ప్రజలు నమ్మే స్థితి ఏర్పడింది! కొన్ని శాఖలకు పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వాలు ఖర్చు పెట్తున్నాయి కానీ అసలైన విద్య-వైద్యం శాఖల మీద సరియైన అభివృద్ధి, వెలుగును ప్రసరింపచేయక పోవటం వల్లనే నిరుద్యోగులు నిరాశతో రోడ్డెక్కుతున్నారు. పేరు సంపాదించని సంస్థలు గూడా అకస్మాత్తుగా ఆ నిరుద్యోగులను విద్యార్థులను ప్రభా వితం చేస్తున్నాయి. ప్రభుత్వాల అలసత్వానికి తోడు పరీక్షా విధానంలో అవినీతి పెచ్చరిల్లటంతో బలమైన ప్రభు త్వాలూ నాయకులు గూడా తలదించుకోక తప్పటం లేదు! విద్యా వ్యవస్థలతో పాటు, పరీక్షా విధానాలలో మార్పులు, ఉద్యోగాల వేటలో వున్న నిరుద్యో గులకు బహుళస్థాయిలో ఉపాధి అవకాశాలు కల్గించగలుగుతే, కొంతమేర వారిలో పేరుకుంటు న్న నిరాశను తొలగించవచ్చు!

రావులపాటి సీతారాంరావు