లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన…

లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన…
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశంలో పెరుగుతున్న వికృత లవ్ జిహాదీ, అక్రమ మత మార్పిడీలు, ప్రణాళిక బద్ధమైన కుట్రలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రచార ప్రముఖ్ దూశెట్టి. పవన్ కుమార్ మాట్లాడుతూ వికృత లవ్ జిహాదీ మనస్తత్వం, ప్రణాళిక బద్దంగా జరుగుతున్న లవ్ జిహాదీ కుట్రలకు వ్యతిరేకంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.
నాసిక్ టిసిఎస్ లో వెలుగు చూసిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ కుట్రలపై హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా హిందూ యువతులు లవ్ జిహాద్ లో పడి తమ జీవితాలను నరకప్రాయం చేసుకోవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా గోరక్ష ప్రముఖ నమిలే. నవీన్ VHP గౌరాయిపల్లి గ్రామ కార్యదర్శి డి.బాలకిషన్, బజరంగ్ దళ్ గౌరాయిపల్లి గ్రామ కో కన్వీనర్ కె. రాహుల్, ప్రవీణ్, శ్యామ్, శివ, సాయి, కార్తీక్, ప్రశాంత్, సాయి కుమార్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
