6:00 P.M. | 2 జూలై 2026 ముఖ్యాంశాలు
9 ఏండ్ల తరువాత ఆ గడ్డ మీద టీమిండియా..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : భారత్ క్రికెట్ జట్టు 2026 ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. click here to read full news
Telangana Job Issue | చర్చలకు వచ్చే దమ్ముందా..?
Telangana Job Issue | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ ఆడబిడ్డగా నేను సవాల్ చేస్తున్నాను… చర్చలకు వచ్చే దమ్ముందా? ఎక్కడికి వస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన ఉద్యోగాల లెక్కలు అన్నీ బయటపెడతాం అంటూ ప్రియాంక అనే యువతి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని ఇప్పుడు అనిపిస్తోందని ఆమె పేర్కొంది. click here to read full news
Biodiversity Heritage Site | ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదా…
ఆంధ్రప్రభ , వెబ్‌డెస్క్ : ప్రాంతాన్ని జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం (బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్)గా జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ (ఎన్‌బీఏ) అధికారికంగా ప్రకటించింది. దేశంలో అడవి వరి (Wild Rice) జాతుల సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అడవి వరి సహజ ఆవాసానికి ప్రత్యేక రక్షణ లభించనుంది. click here to read full news
Tragic incident | తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్ ప్రాణం తీసింది..
Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ముంబైలో గురువారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంధేరి–సాకినాకా, జోగేశ్వరి ప్రాంతాలను కుర్లా, ఘాట్‌కోపర్‌తో అనుసంధానించే ఖైరానీ రోడ్డుపై మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. click here to read full news
Sathupalli | 12 మంది ముఠా అరెస్ట్..
Sathupalli | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న 12 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు కూడా ఉండటం సంచలనంగా మారింది. click here to read full news
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య లక్ష్మీభాయికి బదిలీ…
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి, సీనియర్ అధికారిణి లక్ష్మీభాయిని బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి తెలంగాణ హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు లక్ష్మీభాయి త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. click here to read full news
13thDOST | ముందు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్ అంటున్న ప్రభుత్వ కళాశాలలు
13thDOST | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ (DOST) ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు ప్రవేశాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసి కళాశాలలకు వెళ్లిన విద్యార్థుల నుంచి యాజమాన్యాలు పూర్తి కోర్సు ఫీజును ముందుగానే చెల్లించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. click here to read full news
Telangana Secretariat | తెలంగాణ సచివాలయంలో కొత్త భద్రతా నిబంధనలు..
Telangana Secretariat ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయం ఆవరణలోకి ప్రవేశించే ప్రతి వాహనానికి క్యూఆర్ (QR) కోడ్ తప్పనిసరి చేసింది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాతే వాహనాలకు ప్రవేశం కల్పించాలని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అమలు చేస్తున్నారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే వాహనం నంబర్, యజమాని పేరు, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు అవుతాయి. దీంతో సచివాలయంలోకి ప్రవేశించే ప్రతి వాహనంపై పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. స్కాన్ చేయని వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. click here to read full news
E-mail | అప్రమత్తమైన పోలీసులు
E-mail | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇస్రో ఛైర్మన్ డా. వి. నారాయణ్ కు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. click here to read full news
పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
