ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు..
మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకల్లో మోత్కూర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వంగాల సత్యనారాయణ , జిల్లా కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు పైళ్ల సోమిరెడ్డి, ముషిపట్ల మాజీ సర్పంచ్ తండ సత్తయ్య , కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న , నాయకులు మెంట నగేష్ , యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు అవిశెట్టి కిరణ్ కుమార్, ఆలకుంట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్, పెన్నులను స్వయంగా బీర్ల కు అందజేశారు. ఐలయ్య మరెన్నో జన్మదినాలు, ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.
