హిందువుల ఐక్యతే, జాతీయ సమైక్యత
హిందువుల ఐక్యతే, జాతీయ సమైక్యత
- హిందూ ధర్మ సమ్మేళన సమితి అధ్యక్షుడు తౌటం నవీన్
- హిందూ ధర్మ సమ్మేళనం సమితి కరపత్రాల ఆవిష్కరణ
చిట్యాల, ఆంధ్రప్రభ : హిందువుల ఐక్యతే , జాతీయ సమైక్యత, కు నాంది అని హిందూ ధర్మ సమ్మేళన సమితి అధ్యక్షుడు తౌటం నవీన్, అన్నారు. మండల కేంద్రంలో హిందూ ధర్మ సమ్మేళనం సమితి కరపత్రాలను అధ్యక్షుడు తౌటం నవీన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 15 న మండల కేంద్రంలోని రామాలయ ఆవరణలో జరిగే సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా పూజ్య బ్రహ్మ శ్రీ జ్ఞాన చైతన్య నంద స్వామి హాజరవుతారన్నారు.
ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దేశానికి ఆత్మ హిందూ ధర్మం హిందూ సంస్కృతి , హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరిచి మన దేశాన్ని తిరిగి విశ్వ గురువుగా నిలుపాలనే లక్ష్యంతో నేటి కాలమాన పరిస్థితుల్లో ఎదురవుతున్న అనేక సవాలనుఎదుర్కొనేందుకు హిందువుల ఐక్యత అవసరం అన్నారు. ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ బుర్ర సదయ్య ఎలేటి రామయ్యపల్లి సర్పంచ్ కోడారి అశోక్ , కోటంచ డైరెక్టర్ దొడ్డి కిష్టయ్య, మాజీ సర్పంచ్ పుల్లూరి రమాదేవి- సతీష్, చిట్యాల ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ముదన నాగరాజు, నేపాలి రాకేష్ బండి రాజు, మాటూరి లవన్ బాబు , చింతల రాజేందర్, రాయిని శ్రీనివాస్, కేంసారపు ప్రభాకర్, గుండ మణికుమార్ ,అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
