Choutuppal నాలుగు హత్య కేసుల ఛేదనలో కీలక పాత్ర

Choutuppal నాలుగు హత్య కేసుల ఛేదనలో కీలక పాత్ర

  • హెడ్ కానిస్టేబుల్ యాదగిరికి ఎస్పీ ప్రశంసలు, రివార్డు

చౌటుప్పల్ (Choutuppal), ఆంధ్రప్రభ: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి నాలుగు హత్య కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ అవిరేని యాదగిరికి భువనగిరి జిల్లా ఎస్పీ ప్రశంసాపత్రం, రివార్డు అందజేశారు.

చౌటుప్పల్ మండలం కృష్ణానగర్‌కు చెందిన అవిరేని యాదగిరి ప్రస్తుతం భువనగిరి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల కాలంలో జిల్లాలో జరిగిన నాలుగు హత్య కేసులను ఛేదించడంలో రూరల్ సీఐ ఎన్. చంద్రబాబుకు సహకరిస్తూ కీలక పాత్ర పోషించారు.

ఈ నేపథ్యంలో గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ మీటింగ్‌లో జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ యాదగిరిని ప్రత్యేకంగా అభినందించారు. ఆయన సేవలను గుర్తించి ప్రశంసాపత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు యాదగిరికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.

Leave a Reply