ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
- తహసీల్దార్‌కు బీజేపీ వినతి
మోత్కూర్, ఆంధ్రప్రభ:
మోత్కూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరుతూ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అంతకుముందు స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నాయకులు పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని కొనుగోలు కేంద్రాలలో పేరుకుపోయిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షురాలు చాడ మంజుల రెడ్డి, జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్ గుప్తా, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు నల్ల మాసిరెడ్డి, పట్టణ నాయకులు సజ్జనం మనోహర్, చేకూరి మల్లేశం, అన్నెపు సత్యనారాయణ, బద్ధం మహేందర్ రెడ్డి, దొంతరబోయిన సత్యనారాయణ, బద్దం విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
