ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

వేసవిలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఏలేటి రామయ్యపల్లిలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు మంగళవారం గ్రామ సర్పంచ్ కొడారి అశోక్ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొడారి అశోక్ మాట్లాడుతూ వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉపాధి కూలీలు అలసటకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తగినంత నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీఓ హలీం, పంచాయతీ కార్యదర్శి అజీరా బేగం, ఉపసర్పంచ్ మర్రి సమ్మక్క, వార్డు సభ్యురాలు కసిరెడ్డి ఉమారాణి, టెక్నికల్ అసిస్టెంట్ స్రవంతి, మేట్ పొలంపల్లి కోమల, ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply