మన నాయకుడు …మన గౌరవం

మన నాయకుడు …మన గౌరవం

  • వేం అభినందన సభకు భారీ ఎత్తున తరలిరండి
  • కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపు: మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి

కేసముద్రం, ఆంధ్రప్రభ : రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికై మొదటి సారిగా మన ప్రాంతానికి విచ్చేయుచున్న సందర్భంగా నిర్వహించే వేం నరేందర్ రెడ్డి సన్మాన, అభినందన సభకు కేసముద్రం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వేం అభిమానులు భారీ ఎత్తున తరలి రావాలని మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మార్కెట్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి మాట్లాడారు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనీ నేడు (మంగళవారం) బాలాజీ గార్డెన్ నందు రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికై మొదటి సారిగా మన మహబూబాబాద్ కు విచ్చేయుచున్న వేం నరేందర్ రెడ్డికి సన్మాన, అభినందన సభ ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారనీ పేర్కొన్నారు. ఈనేపధ్యంలో మండల నాయకులు,మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్ లు,వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు ,వార్డు సభ్యులు, అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు ఈ సభలో పాల్గొనీ విజయవంతం చేయగలరని కోరుచున్నామనీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి అంబటి మహేందర్ రెడ్డి, ఆర్టీసీ అథారిటీ సభ్యులు రావుల మురళీ, నాయకులు నీలం దుర్గేశ్, చిలువేరు సమ్మయ్య గౌడ్, భానోత్ చిన్న వెంకన్న, వేముల శ్రీనివాస్ రెడ్డి, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోకల శ్రీనివాస్, బనిశెట్టి వెంకటేశ్, భానోత్ బాలు నాయక్, డైరెక్టర్లు చిదురాల వసంత రావు, ఎండీ అయ్యూబ్ ఖాన్, కౌన్సిలర్లు తరాల వీరేష్ యాదవ్, ధారావత్ కిషోర్, బద్య నాయక్, అంగోత్ బాల, వల్లాందాసు రవి, భానోత్ బాలునాయక్ , కనుకుల రాంబాబు, ఎండీ తాజుద్దీన్, శ్రీరామ్ కిరణ్, షేక్ ముజ్జు, ఎండీ నయీం, రషీద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply