13న విద్యాభివృద్ధిపై సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన సదస్సు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యాశాఖ వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 13న నిజాంసాగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జుక్కల్ మండల విద్యాశాఖ అధికారి తిరుపతయ్య తెలిపారు.

ఈ సదస్సులో విద్యాభివృద్ధి, పాఠశాలల బలోపేతం, విద్యా రంగంలో సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలపై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన సర్పంచులు, బిచ్కుంద మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్లు ఉదయం 9 గంటలకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply