ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా వారోత్సవాలు

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా వారోత్సవాలను నిర్వహించారు.
సోమవారం రోజు పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవాల సందర్భంగా ఐ ఎఫ్ పి ఎస్ అండ్ ఐ డి పి ఎస్ లను కళాశాల ప్రిన్సిపల్ కే సంపత్ కుమార్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కార్పొరేట్ కళాశాలకు దీటుగా డిజిటల్ విద్యను ప్రభుత్వ కళాశాలలో అందించడం జరుగుతుంది వీటి ద్వారా ఐఐటీ,జె ఈ ఈ,నీట్ మరియుఈఏపీఎస్ఈటి మొదలగు పోటీ పరీక్షలకు శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం నుండి విద్యార్థులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం అందించబడుతుంది. ఈ సదుపాయాలన్నింటిని వినియోగించుకోని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు.

Leave a Reply