వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి

వడదెబ్బతో గుర్తుతెలియని వ్యక్తి మృతి
కాళేశ్వరంలో ఘటన
మహాదేవపూర్, మే 23(ఆంధ్రప్రభ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ నది అంత్య పుష్కరాల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కాళేశ్వరంలోని ఇప్పల్ బోరు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి తెలిపారు.
పుష్కరాలకు వచ్చిన ఆ వ్యక్తి ఇప్పలబోర్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉండగా స్థానికులు గమనించి వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక పరీక్షలు నిర్వహించి 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు.
మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, వివరాలు తెలిసిన వారు 8712658115 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
