Iyer Era | శ్రేయస్ చేతికి టీ20 పగ్గాలు.. కొత్త కెప్టెన్‌కు తొలి పరీక్ష

  • నవ‌ శకానికి నాంది
  • టీమిండియా 15వ టీ20 కెప్టెన్‌గా శ్రేయస్..
  • శ్రేయస్‌కు తొలి సవాల్..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఐర్లాండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌తో భారత జట్టుకు కొత్త శకం ప్రారంభం కానుంది. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్… తొలిసారి భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టుకు 15వ కెప్టెన్ గా అయ్యర్ చరిత్రలో నిలవనున్నాడు.

ఇప్పటివరకు భారత టీ20 జట్టుకు మొత్తం 14 మంది కెప్టెన్లు నాయకత్వం వహించారు. వారిలో మహేంద్ర సింగ్ ధోనీ అత్యధికంగా 70 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 42 విజయాలు అందించగా, రోహిత్ శర్మ 62 మ్యాచ్‌ల్లో 50 విజయాలతో అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు.

ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ కూడా 50 మ్యాచ్‌ల్లో 42 విజయాలు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించడంతో పాటు పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చిన అనుభవంతో.. భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఐర్లాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో అతడి కెప్టెన్సీ ప్రయాణం ప్రారంభం కానుంది.

టీ20ల్లో భారత్‌కు నాయకత్వం వహించిన కెప్టెన్లు

కెప్టెన్ మ్యాచ్‌లు విజయాలు
వీరేంద్ర సెహ్వాగ్11
మహేంద్ర సింగ్ ధోనీ7042
సురేశ్ రైనా33
అజింక్య రహానే21
విరాట్ కోహ్లీ4832
రోహిత్ శర్మ6250
శిఖర్ ధావన్31
రిషభ్ పంత్42
హార్దిక్ పాండ్యా1610
కేఎల్ రాహుల్11
జస్ప్రీత్ బుమ్రా22
రుతురాజ్ గైక్వాడ్22
సూర్యకుమార్ యాదవ్5042
శుభ్‌మన్ గిల్54
శ్రేయస్ అయ్యర్ఐర్లాండ్‌తో అరంగేట్రం