కార్మికుల సమ్మెతో కదలని బస్సులు

కార్మికుల సమ్మెతో కదలని బస్సులు
వరంగల్, ఆంధ్రప్రభ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో 1036బస్సులు రోడ్డు ఎక్కలేదు. అయితే అధికారులు స్పందించి హెయిర్ బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించే ప్రయత్నం చేస్తున్నారని, అంతే కాకుండా ఔట్సోర్సింగ్ సిబ్బందితో బస్సులు నడిపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆర్టీసీ డిప్యూటీ ఆర్ ఎం భాను కిరణ్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ సహకారం తీసుకొని చర్యలు చేపడతామని వారు తెలిపారు.
