కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి – వనపర్తి జేఏసీ

కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి – వనపర్తి జేఏసీ
వనపర్తిటౌన్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ రక్షణతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోరుతూ టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు బుధవారం మొదటి డ్యూటీ నుంచే సమ్మె ప్రారంభమైంది. ఈ సందర్భంగా వనపర్తి డిపోలో బస్సులను స్వచ్ఛందంగా నిలిపివేసి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఉదయం హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కొంత మంది ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు జోక్యం చేసుకుని అత్యవసరంగా కొన్ని బస్సులను విడుదల చేసి హైదరాబాద్ ముఖ్య ప్రాంతాలకు పరిమితంగా సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ల పై స్పందించి పరిష్కారం చూపాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
