ఘనంగా తొలి వార్షికోత్సవం

ఎల్కతుర్తి స్టీల్ బ్యాంక్‌లో వేడుక‌లు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో, ఆయన తండ్రి పొన్నం సత్తయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకులు సేవలో ఏడాది పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఎల్కతుర్తి స్టీల్ బ్యాంక్ తొలి వార్షికోత్సవ వేడుకలను స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు, గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. వివాహాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాల సమయంలో పేదలు, అవసరమైన కుటుంబాలకు స్టీల్ బ్యాంకుల సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వక్తలు పేర్కొన్నారు.

సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న స్టీల్ బ్యాంక్ ఏర్పాటు అభినందనీయమని వారు తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి ప్రజాప్రయోజన కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ మునిగడప లావణ్య, ఉప సర్పంచ్ గొడిశాల రాజు హాజరయ్యారు. అలాగే శనిగరపు వెంకటేష్, శీలం అనిల్, మార్కెట్ డైరెక్టర్ గొడిశాల రాజయ్య, బొల్లెపోగు రమేష్ బాబు, ఫొటోగ్రాఫర్ కె. మహేశ్వర చారి, గొడిశాల అర్జున్ గౌడ్, సంధ్య, నాగరాజు, సీఏలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.