ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి

ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి

  • ఎంఎల్ఏ కొత్త ప్రభాకర్ రెడ్డి

రాయపోల్, ఆంధ్రప్రభ : వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం రాయపోల్ మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఎల్లమ్మ కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ పండుగలు, దేవాలయ ఉత్సవాలు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి సంవత్సరం మంచి వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు.

ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం అదే గ్రామంలో రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్న నామసాని సందీప్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు.అలాగే మండలం లోని లింగారెడ్డి పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ షాదుల్లా నివాసంలో హనుమాన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేసారు.అక్కడ పాల్గొని స్వాములకు వడ్డించారు. ఈ కార్యక్రమంలోఈ, బుజ్జి,మహేష్గౌ డ్, కనుకయ్య, నాగులు, రాజు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.