హైదరాబాద్ : నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ (EE Nune Sridhar) నివాసాలపై ఏసీబీ దాడులు (ACB Raids) నేడు నిర్వహించారు.ఆదాయానికి మించిన కేసుల నేపథ్యంలో ఏసీబీ.ఏకకాలంలో 12 చోట్ల సోదాలు చేపట్టింది . హైదరాబాద్,కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నది. ఎస్ ఆర్ ఎస్ పి లో (SRSP) డివిజన్ 8 లో ఈఈ గా నూనె శ్రీధర్ విధులు నిర్వహిస్తున్నారు.

