భీమ్‌గల్ టౌన్ 9 వార్డు అభివృద్ధి బాధ్యత నాదే – మల్లెల రాజశ్రీ..

భీమ్‌గల్ టౌన్ 9 వార్డు అభివృద్ధి బాధ్యత నాదే – మల్లెల రాజశ్రీ..
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలో తొమ్మిదో వార్డును ఆదర్శంగా చేసేందుకు అహర్నిశలు కష్ట పడుతానని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మల్లెల రాజశ్రీ ( మల్లెల లక్ష్మణ్ ) అన్నారు. శుక్రవారం తొమ్మిదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ గత ఐడెండ్లు వార్డు అభివృద్ధి కొరకు తాను చేసిన పనులతో పాటు, అవకాశం ఇస్తే.. చేపట్టే అభివృద్ధి పనులను వివరించారు.
బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ముత్యాల సునిల్ కుమార్ సహకారంతో వార్డులో ఉన్న సమస్యలు సాల్వ్ చేస్తానని అన్నారు. వార్డులో అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ లు ఇప్పించే బాధ్యత నాదేనని పేర్కొన్నారు. వార్డు అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
