Sarpanch | మ‌ద్ద‌తు తెలిపి.. ఎన్నుకొని..

మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా సిందే లింగారం పటేల్

Sarpanch | కుంటాల, ఆంధ్రప్రభ : మండల సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా ఈ రోజు సిందే లింగారం పటేట్ ఎన్నిక‌య్యాడు. కుంటాల మండల 11 మంది సర్పంచ్ సభ్యులు మద్దతు పలకడంతో అత‌న్ని అధ్యక్షుడిగా ప్ర‌క‌టించారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ప్రవళి జాదవ్ శివాజీ, సెక్రెటరీ కుబీర్ రాజన్న కోశాధికారి ఆదిముల్ల సువాసిని కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు లింగారం పటేల్ తెలిపారు, ఈ సందర్భంగా మండలంలోని నెలకొన్న‌ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఉప సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply