Development | పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా…

Development | పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా…
Development | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధి(Developmentకి కృషి చేస్తానని జైనూర్ సర్పంచ్ కొడప ప్రకాష్ అన్నారు. ఇవాళ మండల కేంద్రంలోని గణేష్ నగర్ (ఎస్సీ కాలనీ) లో రూ.5లక్షలతో నిర్మించే కల్వర్టు నిర్మాణ పనులకు సర్పంచ్ ప్రకాష్ జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్ రావుతో కలిసి భూమిపూజ చేశారు.
ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… ప్రజలు తనపై నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించినందుకు రుణపడి ఉండి సేవలందిస్తానని, అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి సహకారంతో పంచాయతీలో అవసరం ఉన్న చోట అభివృద్ధి పనులు చేపట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జై నూరు ఉపసర్పంచ్ డోంగ్రే ప్రకాష్, మాంగ్ సమాజ్ సంఘం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మావాలే దత్త మాంగ్, నాయకులు జన్నావార్ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
