మహిళా బిల్లును అడ్డుకోవడం పట్ల బీజేపీ నిరసన

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పార్లమెంట్ లో నారీ శక్తి మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి పట్టణ కేంద్రంలో బీజేపీ ఆద్వర్యంలో ఆదివారం నిరసన చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య హాజరై మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా బిల్లు వేగిపోవడం భారత ప్రజాస్వామ్యంలో చీకటి రోజని, ప్రధాని నరేంద్ర మోడీ 33 శాతం రిజర్వేషన్లతో మహిళా అభివృద్ధికి బాటలు వేస్తుంటే కాంగ్రెస్, ఇండియా కూటమి కుట్రపూరితంగా అడ్డుకొని మహిళా వ్యతిరేకతను బట్టబయలు చేసుకున్నాయని విమర్శించారు.

రానున్న ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తంగెడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్ రావు, మేకల శ్రీనివాస్, కావేటి రాజగోపాల్, మహంత కృష్ణ, వేల్పుల రమేష్, పెంజర్ల రాకేష్, ఒల్లె తిరుపతి, ఎర్రోళ్ళ శ్రీకాంత్, ఉప్పు కిరణ్, వెన్నంపల్లి శ్రీనివాస్, గుడ్ల సతీష్, పడాల శ్రీధర్, మామిడి ఉమేష్, బొడ్డుపల్లి కుమార్, శివయ్య, గాదసి సతీష్, పోగుల రాజు, పూదరి హరీష్, రాజేష్, కుక్క అంజి, ఆనందరావు, బొడ్డుపల్లి సంపత్, అంజి, వేణు, ఆవుల శ్రీనివాస్, రమ, శిరిషా, లక్ష్మి, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply