ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్..
జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్‌ఓ) మొహినుద్దీన్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం వలపన్ని పట్టుకున్నారు.
ఓ బాధితుడి నుంచి రూ.80 వేల లంచం తీసుకుంటుండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ నేతృత్వంలోని బృందం దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకుంది.
ఈ ఘటనతో జగిత్యాల జిల్లాలో కలకలం రేగింది. ఏసీబీ అధికారులు కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాసేపట్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
