HYD | ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు

HYD | ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు

HYD | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైద‌రాబాద్‌లోని లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెస‌ర్ కోదండ‌రాం, అజారుద్దీన్ పేర్ల‌ను ఆమోదించాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు తెలిసింది. అలాగే ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఏ స‌భ‌లోనూ స‌భ్యుడు కాని అజారుద్దీన్ మంత్రిగా కొన‌సాగుతున్నారు. ఈ నెల 30లోపు ఎమ్మెల్సీగా ఎంపిక కాక‌పోతే ఆయ‌న ప‌ద‌వి కో్ల్పోయే అవ‌కాశం ఉంది.

తెలంగాణ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ పదవికి సంబంధించి సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు నెలల లోపు ఏదో ఒక సభ (అసెంబ్లీ లేదా కౌన్సిల్)లో సభ్యుడిగా ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఈ నెల 30వ తేదీకి సరిగ్గా ఆరు నెలలు పూర్తి కానున్నాయి. అంటే.. మరో పది రోజుల్లోపు ఆయన చట్టసభ సభ్యుడిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply