అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకుల అరెస్ట్

నార్సింగి, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన నార్సింగి బీజేపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. హామీల అమలులో జాప్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు యెన్నం లింగారెడ్డి మాట్లాడుతూ, హామీల అమలు వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోబీజేపీ పట్టణ అధ్యక్షులు మైలారం నర్సింలు, నరేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.