వర్షాకాలం దృష్ట్యా గ్రామాలలో పరిశుభ్రత పనులు వేగవంతం చేయాలి

వర్షాకాలం దృష్ట్యా గ్రామాలలో పరిశుభ్రత పనులు వేగవంతం చేయాలి

మెండోరా గ్రామసభ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : రానున్న వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అదే విధంగా గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భీమ్‌గల్ మండలంలోని బుధవారం ఏడు గ్రామాలలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. మెండోరా గ్రామంలో జరిగిన ప్రత్యేక గ్రామసభలకు ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఏడు అంశాల పై ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ముఖ్యంగా వర్షాకాల సన్నద్ధత సురక్షిత తాగునీరు ఘన వ్యర్ధాల నిర్వహణ జల సంరక్షణ మన సంరక్షణ మొక్కల పెంపకం వనమహోత్సవం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, వరద నిర్వహణ భద్రత అనే అంశాలపై గ్రామ సభలో చర్చించడం జరిగింది. అనంతరం గ్రామంలో ప్లాస్టిక్ నివారణకు గ్రామపంచాయతీ పాలకవర్గం చర్యలు తీసుకొని మెండోరా ప్రతి ఇంటికి ఒక జూట్ బ్యాగ్ ఇస్తూ ప్లాస్టిక్ నివారణ కొరకు చర్యలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మెండోరా గ్రామ ఉపసర్పంచ్ రమేష్, వార్డ్ మెంబర్లు,మహిళా సంఘ వివో లు, పంచాయతీ సెక్రెటరీ ప్రశాంత్,జిపివో,ఏఈఓ, ఆశ వర్కర్,అంగన్వాడి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.