నిండు జీవితానికి రెండు చుక్కలు..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలంలోని జగిర్యాల్ గ్రామంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గడల ప్రసాద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పుట్టిన పిల్లలనుండి ఐదు సంవత్సరాలలో పు పిల్లలకి పల్స్ పోలియో చుక్కలని వేయడం జరిగిందని అన్నారు. పోలియో రహిత గ్రామంగా ఉండాలని ఉద్దేశంతో ఒకరోజు ముందు ప్రజలకు అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్క పిల్లలకి పల్స్ పోలియో లు వేయించాలని గ్రామ మంత చాటింపు చేయడం జరిగింది. ఆరోగ్యవంతమైన గ్రామం గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్, మగిడి భోజన్న, ఓ మై రాజేశ్వర్,బొంగు రాజేశ్వర్ వార్డు సభ్యులు సురేష్, డాక్టర్ గంగాధర్, రాజేందర్, ఏఎన్ఎం హరిత, ఆశ వర్కర్ రజిత, ఇతరులు పాల్గొన్నారు.