ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
మైలవరం,ఆంధ్రప్రభ: లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (ఎల్బీఆర్సీఈ) ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. అప్పారావు మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పింగళి వెంకయ్య అందించిన సేవలు, ఆయన ప్రతిభతో పాటు వ్యవసాయ రంగంలో చేసిన పరిశోధనల గురించి వివరించారు.
వైస్ ప్రిన్సిపాల్ డా. బి. రమేష్‌రెడ్డి మాట్లాడుతూ, పింగళి వెంకయ్య విద్యాభ్యాసం, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన అందించిన స్ఫూర్తిదాయక సేవలను వివరించారు. జాతీయ జెండా ప్రాముఖ్యత, అందులోని రంగుల విశిష్టతతో పాటు జెండా రూపకల్పనలో పింగళి వెంకయ్య చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీన్లు, వివిధ విభాగాధిపతులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అసిస్టెంట్ ఆఫీసర్ ఎస్. ఉమామహేశ్వరరెడ్డి, ఎన్సీసీ కోఆర్డినేటర్ ఆర్. పవిత్ర తదితరులు పాల్గొన్నారు.
