నల్లగొండ జిల్లాలో విషాదం..
నల్లగొండ జిల్లాలో విషాదం..
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా (Nallagonda District) లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం, రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆందోళనతో ఏలేటి సోమిరెడ్డి (45) అనే కంప్యూటర్ ఆపరేటర్ శుక్రవారం రాత్రి నల్లగొండ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య (suicide) చేసుకున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని శివాజీ నగర్ కాలనీలో నివాసముండే సోమిరెడ్డి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీవో కార్యాలయం (MPDO Office) లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం తన స్వగ్రామమైన మద్దిరాల నుంచి నిర్వహణలో భాగంగా తుంగతుర్తికి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతనికి ఆరోగ్యం సహకరించడం లేదు.
దీంతో పాటు రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పుల బాధ పెరిగిపోవడం, కుటుంబాన్ని ఎలా పోషించాలన్న సమస్యలతో ఇబ్బంది పడ్డ సోమిరెడ్డి గత రాత్రి శ్రీరామ్ పల్లి నల్లగొండ మధ్యన రైల్వే లైన్ పై నిలబడి ట్రైన్ (train) కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను మృతితో కుటుంబం లో తీవ్ర విషాదం నెలకొంది. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. మృతుని తండ్రి ఎస్సైగా పనిచేసి కొద్ది కాలం క్రితం రిటైర్ అయ్యాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
