మర్డర్ల కన్న రోడ్డు ప్రమాదాలు పది రేట్లు ఎక్కువ

మర్డర్ల కన్న రోడ్డు ప్రమాదాలు పది రేట్లు ఎక్కువ

  • తాగి బండి నడిపితే సీజ్, ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం – 2026లో భాగంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గుంటూరుపల్లి గ్రామంలో ‘అరైవ్ ఆలివ్’ ప్రోగ్రాం గ్రామ సర్పంచి నాగమల్లేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు 100 హెల్మెట్లను పంపిణీ చేశారు. తద్వారా జిల్లాలోనే 100 శాతం హెల్మెట్ ధారణ గ్రామంగా నిలిచింది. “నో హెల్మెట్ – నో ఎంట్రీ” నినాదంతో ఆదర్శ గ్రామంగా గుంటూరుపల్లి నిలిచింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. “2025 గణాంకాల ప్రకారం మన జిల్లాలో మర్డర్ ల కన్నా రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య 10 శాతం పెరిగిందని ఆందోళనకరంగా ఉంద అన్నారు. హెల్మెట్ ధరించకపోవడమే మెజారిటీ మరణాలకు ప్రధాన కారణం. గుంటూరుపల్లి గ్రామం నేడు తీసుకున్న ఈ నిర్ణయం జిల్లా వ్యాప్తంగా మార్పుకు నాంది కావాలి” అని పిలుపునిచ్చారు.

స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ”హెల్మెట్ ధరించడం కేవలం చట్టం కోసం కాదు, అది మీ కుటుంబానికి ఇచ్చే భద్రత అన్నారు. మద్యం తాగి బైక్ నడిపితే బండి సీజ్ చేయాలని ఆదేశించారు. పార్టీలకు అతీతంగా ఎలాంటి రాజకీయం లేకుండా సహకరించాలన్నారు. గుంటూరుపల్లి గ్రామస్థుల చొరవను చూసి జిల్లాలోని మిగతా గ్రామాలు కూడా స్ఫూర్తి పొందాలిఅని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సంపత్ రావు , మాట్లాడుతూ, పోలీస్ శాఖ నిరంతరం ప్రజల రక్షణ కోసమే పనిచేస్తుందని, యువత వేగాన్ని నియంత్రించుకొని హెల్మెట్‌ను కవచంగా మార్చుకోవాలని సూచించారు. సీఐ మల్లేష్ మాట్లాడుతూ,ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.

​దాతలకు సన్మానం:

​ఈ బృహత్తర కార్యక్రమానికి 100 హెల్మెట్లను విరాళంగా అందించిన,పాశం వీరశంకర్, శాకమూరి అమర్, మన్నెం పెద్ద తిరుపతయ్య, మక్కెన అవినాష్, దాతలను ఎస్పీ, ఎమ్మెల్యే లు ఘనంగా సన్మానించారు.

బైకు ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎస్పీ,

​కార్యక్రమం అనంతరం గుంటూరుపల్లి నుండి చిట్యాల వరకు బైక్ లపై హెల్మెట్లు ధరించి భారీ ర్యాలీ నిర్వహించి, ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి ఎస్ ఆర్, ఎస్ పి తాసిల్దార్ వసంతరావు, ఎంపీడీఓ, జయశ్రీ, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్, టేకుమట్ల ఎస్ఐ అమూల్య, మొగుళ్ళపల్లి ఎస్ఐ సురేష్, చిట్యాల ఎస్ఐ-3 ఈశ్వర్యలతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply