మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
నేరాల నియంత్రణకు చెక్‌పోస్టులు, పికెట్ల ఏర్పాటు
బాసర, ఆంధ్రప్రభ : జిల్లా సరిహద్దుల్లో నేరాల నియంత్రణను మరింత పటిష్ఠం చేసేందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
బైంసా ఏఎస్పీ పర్యవేక్షణలో బాసర సీఐ దీపక్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. బిద్రెల్లి నుంచి ధర్మాబాద్, బాసర నుంచి నయాగామ్‌కు వెళ్లే రహదారులపై చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అదేవిధంగా బాసర రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసి వారి వేలిముద్రలను సేకరించారు. నేర నియంత్రణలో భాగంగా చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
