గురువుకు మించిన దైవం లేదు..

  • ఉపాధ్యాయ ఉద్యోగులకు పదవివిరమణ సహజం

జైనూర్, ఆంధ్రప్రభ : గురువుకు మించిన దైవం లేదని గురుతర బాధ్యత ఎంతో గొప్పదని ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకు పదవి విరమణ సహజమని ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జైనుర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాధ్ రావు వక్తలు అన్నారు. ఆదివారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండలంలోని కోహినూర్ బాలికల ఆశ్రమమో న్నత పాఠశాలలో పనిచేసిన మడావి లక్ష్మణ్ పదవి విరమణ పొందడంతో అదే పాఠశాలలో పదవి విరమణ పొందిన మడవి లక్ష్మణ్ లీలాబాయి దంపతుల కు ఆత్మీయ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వారితోపాటు ఆదివాసి సంఘాల నాయకులు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో మడవి లక్ష్మణ్ లీలాబాయి దంపతులకు మెమొంటోలు అందించి శాలువాలతో ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మడవి లక్ష్మణ్ 39 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తులు చేసిన సేవలను కొనియాడారు. ఆయన పనిచేసే పాఠశాలలోనే పదవి విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో పిల్లాపాపలతో సంతోషంగా గడవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కోహినూర్ సర్పంచ్ మడవి విజయలక్ష్మి, ఆశిఫాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ ముఖిద్, జై నూర్ మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ యాదవ్, కోహినూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాందేవ్, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెస్రం మోతిరామ్, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర నాయకులు అనక దేవేందర్, అభిమన్యు గ్రూప్ చైర్మన్ మెస్రం శేఖర్,కోలాం సంఘము రాష్ట్ర నాయకులు ఆత్రం భాస్కర్,ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు ఆత్రం భుజంగరావు, కోట్నాక్ భీమ్రావు, తులసి రామ్, ఉరువేత మోహన్, ఆత్రం ఆనంద్ రావు, రాయి సెంటర్ల సర్ మేడిలు ఆత్రం ఆనందరావు, సర్పంచులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆదివాసి సంఘాల నాయకులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు.