ఘనంగా భూక్య జాన్సన్ నాయక్ జన్మదిన వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉట్నూర్ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంద్ర జైవంత్‌రావు, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్‌తో పాటు పార్టీ నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం లక్కారం గ్రామంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పంద్ర జైవంత్‌రావు, ధరణి రాజేష్ మాట్లాడుతూ భూక్య జాన్సన్ నాయక్ ప్రజా సేవకు నిర్వచనమని, నిస్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ప్రజల నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో మరింత ముందుండి ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కూర్సెంగ భూమన్న, మాజీ ఎంపీటీసీ అమీనాబీ, బీఆర్ఎస్ నాయకులు సడిగే రాజ్‌కుమార్, దూట మహేందర్, సిడం సోనేరావు, జాదవ్ రవి, బొడ్డు నరేష్, కమేరి రాజు, సాజిద్, సాధని సురేష్ రాథోడ్, అన్వేష్ జాదవ్, గిరి నాయక్, రామ్‌కోటేష్, శంశీర్, వినయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply