పాత కక్షలతో వ్యక్తి పై గొడ్డలితో దాడి

పాత కక్షలతో వ్యక్తి పై గొడ్డలితో దాడి

జమలయ్య పరిస్థితి విషమం
విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు

ఎ.కొండూరు,ఆంధ్రప్రభ : పాత కక్షలతో దారి కాచి పథకం ప్రకారం పొలంలోకి వెళ్లి తిరిగి వస్తున్న వ్యక్తిపై గొడ్డలితో నరికిన సంఘటన మండలంలోని పెద్ద తండా సమీపాన మైలవరం బ్రాంచ్ నాగార్జునసాగర్ కాలువ కట్టపై గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం చీమలపాడు గ్రామానికి చెందిన పటాపంచల జమలయ్య,పెద్ద తండా సమీపంలోని తన పంట పొలంలోకి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా అప్పటికే అతని రాక కోసం ఎన్ఎస్ పి కాల్వ కట్టపై మాటు వేసిన పెద్దతండా గ్రామానికి చెందిన లావూరి సీతారాం గొడ్డలితో నరికి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

దీంతో తీవ్ర గాయాలు అయిన జమలయ్య,అపస్మారక స్థితిలోకి వెళ్ళగా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితుడుని చీమలపాడు లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా,అక్కడి డాక్టర్ తలకు తగిలిన గొడ్డలి దెబ్బ ప్రమాదకరంగా ఉందని పరిస్థితి విషమంగా ఉండడంవల్ల వెంటనే విజయవాడ తీసుకు వెళ్లాల్సిందిగా చెప్పడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిసింది.

ఈ విషయమై ఎ.కొండూరు ఎస్ ఐ జి.మహాలక్ష్మణుడిని వివరణ కోరగా గొడ్డలితో దాడి జరిగిన మాట వాస్తవమేనని సంఘటనా స్థలాన్ని పరిశీలించానని తీవ్ర గాయాలు అయిన జమలయ్యను కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారని బాధితుడి వాంగ్మూలం తీసుకోవడానికి సిబ్బందిని పంపినట్లు ఎస్ ఐ మహా లక్ష్మణుడు తెలిపారు.

Leave a Reply