పెట్రోల్ బంకులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

పెట్రోల్ బంకులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు పట్టణంలో పెట్రోల్ బంకుల్లో నిబంధనల ఉల్లంఘనపై జిల్లా ఉన్నత సీరియస్ అయింది అని నందికొట్కూరు తహసీల్దార్ శ్రీనివాసులు సీఐ అశోక్ కుమార్, వ్యవసాయ అధికారి షేక్షావలి ఎస్సై చంద్రశేఖర్ అన్నారు. అందులో భాగంగా సోమవారం టాస్క్ ఫోర్స్ టీమ్ వెళ్లి నందికొట్కూరు పట్టణంలో పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని బంకులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పెట్రోల్ బంక్ యజమానులను హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పట్టణంలో కృత్రిమ కొరతపై కొరడా స్టాక్ ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని వారు డీలర్లను హెచ్చరించారు.
పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిఘా పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రేషన్ పద్ధతి, ధరల దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని బంకుల్లో ద్విచక్ర వాహనానికి రూ.100, ఆటోకు రూ.200, కారుకు రూ.500లకు మాత్రమే ఇంధనం ఇస్తున్నారు. డిమాండ్ పేరుతో రేట్లు పెంచినా, తూకాల్లో తగ్గించినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు అనధికారిక కంటైనర్లు లేదా బాటిళ్లలో పెట్రోల్‌ను తీసుకెళ్లడం, నిల్వ చేయడం ప్రాణాంతకమని ఉన్నతాధికారులు హెచ్చరించింది అని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బంకు లైసెన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేయడం జరుగుతుందని అన్నారు.
నందికొట్కూరు పట్టణంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని అధికారులు తెలిపారు. పుకార్లు నమ్మి ఎక్కువగా కొనుగోలు చేసి కృత్రిమ కొరతకు కారణం కావొద్దని వారు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని, పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని పౌరసరఫరాల శాఖకు ఆదేశించారు నందికొట్కూరు పట్టణంలో బంకుల్లో తనిఖీలు ముమ్మరం చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొన్నారు.
స్టాక్ విషయంలో సమస్యలు ఉంటే డీలర్లు 1967 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. పెట్రోల్ బంకుల యజమానులు, డీలర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది అని వారు తెలిపారు కాకినాడ, కడప, అనంతపురం నుంచి రీఫిల్లింగ్ నిరంతరం జరుగుతోంది అని వారు తెలిపారు.
ప్రజలు ఆందోళన చెంది క్యూలు కట్టాల్సిన అవసరం లేదు. అవసరమైన మేరకే ఇంధనం తీసుకోవాలి. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా, తూకాల్లో మోసం చేసినా లైసెన్స్ రద్దు చేస్తాం అని అన్నారు, ప్రజలు నేరుగా స్టాక్ విషయంలో సమస్యలు ఉన్న డీలర్లు, బ్లాక్ మార్కెట్ సమాచారం ఉన్న ప్రజలు 1967 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి అని తెలిపారు.
