భ్రమరాంబిక అమ్మవారికి వెండి నాగాభరణం విరాళం…

భ్రమరాంబిక అమ్మవారికి వెండి నాగాభరణం విరాళం…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో వెలిసిన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవారికి హైదరాబాదుకు చెందిన యం. నవ్యరవీంద్రారెడ్డి అయిదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణాన్ని దేవస్థానానికి విరాళంగా స‌మ‌ర్పించిన‌ట్లు దేవస్థానం కార్యనిర్వాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు.

వెండి నాగాభరణం బరువు 2 కేజీల 400 గ్రాములుగా ఉందన్నారు. ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయస్వామి, ఉప ప్రధానార్చకులు యం. శివశంకరయ్య, పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయం ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునలకు అందజేశారు. అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనంతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply