రేపే పాలీసేట్‌ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

రేపే పాలీసేట్‌ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కదిరి పట్టణంలో నిర్వహించనున్న పాలీసెట్–2026 పరీక్షకు మొత్తం 1,632 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టౌన్ కోఆర్డినేటర్ పి. భాస్కర్ తెలిపారు. పట్టణంలోని ఐదు పరీక్షా కేంద్రాలలో పరీక్షను నిర్వహించనున్నారు.

పరీక్షా కేంద్రాల వారీగా అభ్యర్థుల సంఖ్య ఇలా ఉంది:
జడ్పీ హైస్కూల్ (గర్ల్స్) – 312 మంది
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ – 288 మంది
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ – 300 మంది
వేమన హైస్కూల్ – 359 మంది
ఎస్టీ ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ – 373 మంది

విద్యార్థులు తప్పనిసరిగా తమ పాలీసెట్ హాల్ టికెట్ వెంట తీసుకుని ఉదయం 10 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.పదవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు పాలిటెక్నిక్‌లో చేరి మంచి భవిష్యత్తు సాధించవచ్చని ఈ సందర్భంగా సూచించారు.

Leave a Reply