AirCrash | పైలట్‌పై ఆందోళన

AirCrash | పైలట్‌పై ఆందోళన

AirCrash | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అస్సాంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-31 కార్గో విమానం ప్రమాదానికి గురైంది. జోర్హాట్ వైమానిక స్థావరంలో ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

సామాగ్రి రవాణాకు వినియోగించే ఈ కార్గో విమానం రన్‌వేపై దిగే క్రమంలో కుప్పకూలినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. విమానంలో ఉన్న సిబ్బంది పరిస్థితిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై భారత వైమానిక దళం దర్యాప్తు ప్రారంభించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

AirCrash