Tirumala13thjune26 | శ్రీవారి భక్తులకు అలర్ట్
Tirumala13thjune26 | శ్రీవారి భక్తులకు అలర్ట్
Tirumala13thjune26 | సెప్టెంబర్ నెల కోటా షెడ్యూల్ విడుదల
జూన్ 18 నుంచి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి కోటాల విడుదల
రూ.300 ప్రత్యేక దర్శనం, శ్రీవాణి, అంగప్రదక్షిణ టోకెన్ల తేదీలు ఖరారు
Tirumala13thjune26 | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదులు, ప్రత్యేక దర్శన కోటాల ఆన్‌లైన్ విడుదల తేదీలను అధికారికంగా వెల్లడించింది. జూన్ 18 నుంచి 24 వరకు వివిధ దశల్లో ఈ కోటాలు అందుబాటులోకి రానున్నాయి.
ఆర్జిత సేవల నమోదు ప్రారంభం
సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రక్రియ జూన్ 18 ఉదయం 10 గంటలకు ప్రారంభమై, జూన్ 20 ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. డిప్‌లో ఎంపికైన భక్తులు జూన్ 20 నుంచి 22 వరకు మధ్యాహ్నం 12 గంటల్లోపు చెల్లింపులు పూర్తి చేసి టికెట్లను ఖరారు చేసుకోవాలి.
వర్చువల్ సేవలు, దర్శన కోటాలు
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించిన కోటా జూన్ 22 ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా అందుబాటులోకి రానుంది.
అంగప్రదక్షిణ, శ్రీవాణి కోటాలు
జూన్ 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన బ్రేక్ దర్శన కోటాను అందుబాటులో ఉంచనున్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కోటా
వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా జూన్ 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానుంది.
రూ.300 ప్రత్యేక దర్శనం, వసతి గదులు
సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జూన్ 24 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటా కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది.
భక్తులు టికెట్లు, వసతి గదులను టీటీడీ అధికారిక బుకింగ్ పోర్టల్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని దేవస్థానం సూచించింది.
