Annamalai Politics | ఎన్నికల బరిలోకి వస్తాం…

Annamalai Politics | ఎన్నికల బరిలోకి వస్తాం…

Annamalai Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేస్తూ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికారు.

‘భారతీయుడిగా.. తమిళుడిగా గర్విస్తున్నా’

తన రాజకీయ ప్రయాణంలో రాష్ట్ర అభివృద్ధికే అత్యంత ప్రాధాన్యం ఇస్తానని అన్నామలై పేర్కొన్నారు. భారతీయుడిగా, తమిళుడిగా గర్వపడుతున్నానని చెప్పారు. తమిళనాడు అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనే తన రాజకీయ లక్ష్యమని వెల్లడించారు.

బీజేపీతో 18 నెలలుగా విభేదాలు

గత 18 నెలలుగా బీజేపీ నాయకత్వంతో అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయని అన్నామలై తెలిపారు. అదే కారణంగా పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. తాను స్థాపించబోయే కొత్త రాజకీయ వేదికలో యువత, కొత్త నాయకత్వానికి పెద్దపీట వేస్తానని చెప్పారు. కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

Leave a Reply