అధునాత‌న టెక్నాల‌జీ సెంట‌ర్

అధునాత‌న టెక్నాల‌జీ సెంట‌ర్

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్(Kishtapur) గ్రామ సమీపాన రూ.40 లక్షలతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(Advanced Technology Centre) (ఏటీసీ)ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్(Vedmabojju Patel) ఈ రోజు మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతనమైన టెక్నాలజీ(Technology)ని గ్రామీణ ప్రాంత విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రయ్య,ఐటీఐ ప్రిన్సిపాల్ రాములు(Ramulu), స్థానిక త‌హ‌శీల్దార్‌ రాజమనోహర్ రెడ్డి, ఎంఈఓ విజయకుమార్, జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ(Durgam Lakshminarayana), పొనకల్ పీఏసీఎస్ చైర్మన్ అల్లం రవి(Allam Ravi), తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply