Helmet | ప్రాణ రక్షణకు హెల్మెట్ తప్పనిసరి

Helmet | ప్రాణ రక్షణకు హెల్మెట్ తప్పనిసరి

  • జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు
  • మచిలీపట్నంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించిన ఎస్పీ, పోలీసులు

Helmet | కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రాణ రక్షణకు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ‌ ఉదయం ఎస్పీ ఆధ్వర్యంలో మచిలీపట్నం(Machilipatnam) కోనేరు సెంటర్ నుంచి కోటతుల్ల వారి సెంటర్, నాయర్ బడ్డి సెంటర్, పరాస్ పేట, లక్ష్మీటాకీస్ సెంటర్ మీదుగా తిరిగి కోనేరు సెంటర్ వరకు హెల్మెట్ ర్యాలీని నిర్వహించారు.

హెల్మెట్ ధరించిన పోలీసులు బైక్లపై రహదారుల వెంబడి ప్రయాణం చేశారు. హెల్మెట్ ధరించటం ద్వారా వాహనదారులకు ఎలాంటి ప్రమాణాల బారిన పడకుండా ఉంటారని ఎస్పీ తెలియజేశారు.

నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు జరుగుత ఉన్నాయని, ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా మాసోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని డిఎస్సీలు, సీఐలు, ఎస్ఐలు హెల్మెట్(Helmet) యొక్క ప్రాధాన్యత వివరిస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపౌరు. హెల్మెట్ ధరించని వాహనదారులకు హెల్మెట్ కొనుగోలు చేయించి వారికి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

నిరంతరం ప్రజాసేవలో పోలీసుశాఖ ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి డ్రమ్ములు సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రజలకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన నియమ నిబంధనలు వివరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ భద్రతతో ప్రయాణాలు సాగించాలని విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ ఎన్ ఫోర్స్ మెంట్(Enforcement) 24/7 ఏర్పాటు చేస్తామని, కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply