అమ్మవారికి బంగారు గాజులు

అమ్మవారికి బంగారు గాజులు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని శ్రీ కనక దుర్గమ్మ వారికి హైదరాబాద్ కు చెందిన ఎం. పి. డి. కళ్యాణి దంపతులు 24 గ్రాముల బంగారం గాజులను సమర్పించారు. ఆదివారం దేవస్థానమునకు విచ్చేసిఆలయం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ )సమక్షంలో ఆభరణం అందించారు.

ఈ సందర్బంగా దాత కుటుంబీకులకు ఆభరణం పొందినట్లుగా దేవస్థానం నుండి రశీదు అందజేసి,శ్రీ అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేసి, చిత్రపటం, ప్రసాదాలను దేవస్థానం నుండి అందించారు.

Leave a Reply